మరోసారి ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేస్తోంది కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్. ఇప్పటికే పలు దేశాలు విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా ఒమిక్రాన్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఉప ముఖ్యమంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని మాట్లాడుతూ.. ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోందని దీని పై సీఎం సమీక్ష చేపట్టారని వెల్లడించారు. ఒమిక్రాన్ వస్తే ఏం చేయాలనే అంశంపై సీఎం సూచనలు చేశారని ఆయన తెలిపారు.
Also Read : బ్రేకింగ్ : ఓమిక్రాన్‌పై సబ్ కమిటీ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
విదేశీ ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ నెలాఖరు నుంచి జనవరి 15 లోపు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తి చేయాలి సీఎం జగన్ ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. హాస్పిటళ్ళల్లో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని సూచించినట్లు తెలిపారు. ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపడతామని, ప్రజలందరు కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.