NTV Telugu Site icon

స్పీక‌ర్ త‌మ్మినేని ఆరోగ్య ప‌రిస్థితి.. కుమారుడి ప్ర‌క‌ట‌న‌

thammineni

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స్పీక‌ర్ తమ్మినేని సీతారాం తీవ్ర అస్వస్థతకు గుర‌య్యార‌న్న వార్త‌లు వ‌చ్చాయి.. దీంతో ఆయనను తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికొత్స పొందుతున్న తమ్మినేని.. అయితే, త‌మ్మినేని ఆరోగ్య‌ప‌రిస్థితిపై ఆయ‌న కుమారు చిరంజీవి నాగ్ తాజాగా ఓ ప్ర‌క‌ట‌న చేశారు.. నాన్నగారు ఆరోగ్యంగానే ఉన్నారు.. డీ హైడ్రేషన్ కు గురైనందున జ్వరం వ‌చ్చింద‌ని.. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నందున ముందస్తు జాగ్రత్త కోసమే ఆసుపత్రిలో చేర్చిన‌ట్టు విరించారు.. ప్రస్తుతం నాన్నగారి రిపోర్టులన్నీ నార్మల్ గానే ఉన్నాయ‌న్న త‌మ్మినేని కుమారుడు.. జ్వరం నుంచి కోలుకున్నారు.. చక్కగా మాట్లాడుతున్నారు.. అభిమానులు , కార్యకర్తలెవరూ ఆందోళన చెందాల్సిన అవ‌స‌రం లేదు.. రెండు, మూడు రోజుల్లో డిశ్ఛార్జి అవుతార‌ని ప్ర‌క‌టించారు. కాగా, గ‌త నెల‌లో క‌రోనావైర‌స్ బారిన ప‌డి త‌మ్మినేని సీతారాం దంప‌త‌లు కోలుకున్న సంగ‌తి తెలిసిందే.