NTV Telugu Site icon

Andhra Prasesh: పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీక్ కలకలం.. స్పందించిన కలెక్టర్

Paper Leak

Paper Leak

చిత్తూరు జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. అయితే కాసేపటికే పేపర్ లీక్ అంశం స్థానికంగా కలకలం రేపింది. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే తెలుగు -1 పేపర్ వాట్సాప్‌లో రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఈ అంశంపై జిల్లా విద్యాశాఖాధికారి స్పందించారు. సోషల్ మీడియాలో బయటకు వచ్చిన పేపర్ చిత్తూరు జిల్లాకు సంబంధించింది కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు వివరించారు.

అయితే పలమనేరులో పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్ హరినారాయణ సైతం పేపర్ లీక్ అంశంపై మాట్లాడారు. జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలిపారు. పరీక్ష ప్రారంభమైన రెండు గంటల తర్వాత సోషల్ మీడియాలో పేపర్ లీక్ అయిందని డీఈవోకు సమాచారం అందిందని.. ఈ మేరకు డీఈవో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారని.. కానీ విద్యార్థులు పేపర్ లీక్ వదంతులను నమ్మవద్దు అని కలెక్టర్ హరినారాయణ కోరారు.

Andhra Prasesh: నేటి నుంచి టెన్త్ పరీక్షలు.. రంగంలోకి స్క్వాడ్స్