అమరావతి ఉద్యమం ప్రారంభమయ్యి 600 రోజులు పూర్తైన సందర్బంగా న్యాయస్తానం టు దేవస్థానంకు ఉద్యమకారులు పిలుపునిచ్చారు. దీంతో రైతులు, మహిళలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేశారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు ఉద్యమకారులను అడ్డుకున్నారు. దీంతో రైతులు, మహిళలు రోడ్లపై భైఠాయించి నిరసనలు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులకు, రైతు మహిళలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు మహిళా ఉద్యమకారులను అదుపులోకి తీసుకున్నారు. రాజధాని ప్రాంతంలోని మందడం, వెంకటపాలెంలో ప్రస్తుతం పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. శాంతియుతంగా నిరసనలు చేస్తున్నామని, కానీ పోలీసులు కావాలనే అడ్డుకుంటున్నారని రైతులు, మహిళలు మండిపడుతున్నారు.
Read: నీరజ్ చోప్రా గురించి ఎవరికీ తెలియని విషయాలు ఇవే !