కోనసీమ జిల్లా పేరు మార్పును నిరసిస్తూ మంగళవారం అమలాపురంలో ఆందోళనకారులు హింసాత్మక ఘటనలకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే బుధవారం కూడా కోనసీమ ప్రాంతంలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. మళ్లీ ఆందోళనలు ప్రారంభం కావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఛలో రావులపాలెంకు కోనసీమ జిల్లా సాధన సమితి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. దీంతో బుధవారం ఉదయం నుంచి ప్రశాంతంగా ఉన్న రావులపాలెంలో కొద్దిసేపటి క్రితమే ఆందోళనలు మొదలయ్యాయి.
Minister Roja: అమలాపురం అల్లర్లకు కారణమైన వ్యక్తి జనసేన కార్యకర్తే
రావులపాలెం పట్టణంలోని కళావెంకట్రావు విగ్రహం వద్ద నిరసనకారులు ఆందోళన తెలుపుతూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. రావులపాలెంలో నిరసనలు ప్రారంభమైన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై.. మంగళవారం తరహా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగా షాపులన్నీ మూయిస్తున్నారు. యువతను రోడ్లపైకి రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే 100 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.