NTV Telugu Site icon

Vizianagaram: బోరు బావిలో నీరు తాగిన బాలుడు.. కర్రలతో కొట్టుకున్న గ్రామస్తులు

Vijayanagaram

Vijayanagaram

ఓ సంఘ‌ట‌న అచ్చం కంచె సినిమా సీన్ ను గుర్తుచేసింది. బాలుడు బోరు బావి వ‌ద్ద నీరు తాగ‌డంతో..ఇరు వ‌ర్గాల వారు దాడి చేస్తుకున్న ఘ‌ట‌న విజ‌య‌న‌గ‌రం జిల్లా నెల్లిమ‌ర్ల మండ‌లం మ‌ల్యాడ గ్రామంలో చోటుచేసుకుంది. కర్రలు, రాళ్లతో రెండు వర్గాలు ఘర్షణకు దిగ‌డంతో ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరువ‌ర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో పలువురికి గాయల‌య్యాయి. గ్రామంలో ఘ‌ర్షణ‌లు తావు లేకుండా వుండేందుకు పోలీసులు భ‌ద్ర‌త ఏర్పాటు చేశారు. బాలుడు నీరు తాగ‌డం వ‌ల్లే ఈ ఘ‌ర్ష‌ణ జ‌రిగింద‌ని పోలీసులు చెబుతున్నారు. ఈ దాడిలో దాదాపు 8 మందికి తీవ్రగాయాలు కావ‌డంతో.. చికిత్స కోసం ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

అయితే.. గ్రామంలోని బీసీ కాలనీలోని బారుబావి వుంది. ఈ బావిలో ఎస్సీ కాల‌నీకి చెందిన బాలుడు దాహార్తి తీర్చ‌కున్నాడు. దీంతో బీసీలు కొంద‌రు ఆ బాలుడిపై దాడి చేశారు. అయితే బాలుడిపై దాడి చేయ‌డంతో.. బాలుడి కుటుంబ స‌భ్యులు , ఎస్సీ కాల‌నీ వాసులు .. బీసీ వ‌ర్గీల‌పై దాడి చేశారు. దీంతో ఒక‌రొనొక‌రు తోపులాట‌, వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం చోటుచేసుకుంది. ఆ వాతావ‌ర‌ణం కాస్త‌.. క‌ర్ర‌లు, రాళ్లు విసురుకున్నారు. 8 మందికి తీవ్ర గాయాల‌య్యాయి. అయితే.. ఈ సంఘ‌ట‌న‌కు మ‌రో కార‌ణం కూడా వుంద‌ని కొంద‌రు వాదిస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ కులాంతర వివాహం కూడా ఈ వివాదానికి కారణమేన‌ని స‌మాచారం. అంతేకాకుండా దసరా సమయంలో పాత కక్ష్యలను మనుసులో పెట్టుకుని బీసీ కాలనీవాసులు దాడులకు దిగారని గ్రామస్థులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఘర్షణలు జ‌ర‌కుండా పోలీసులు పికెట్‌ ఏర్పాటు చేశారు. గ్రామంలో మ‌ళ్లీ ఉత్రిక్త‌త‌కు అవ‌కాశం ఉంద‌ని భావించిన పోలీసులు భారీ బందో బ‌స్తు ఏర్పాటు చేశారు.

Show comments