Site icon NTV Telugu

కాణిపాకంలో కొనసాగుతున్న టెన్షన్…

ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి, పొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మధ్య ప్రమాణాల వివాదం కొనసాగుతుంది. ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు వివాదంపై బీజేపీ వైసీపీ ల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. తనపై రాచమల్లు చేసిన అవినీతి ఆరోపణలు నిరాధారమైనవంటూ కాణిపాకం ఆలయంలో సత్య ప్రమాణానికి సిద్ధమయ్యారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి. ఈ సత్య ప్రమాణానికి ఎమ్మెల్యే రాచమల్లు ముందుకురావాలని విష్ణు డిమాండ్ చేసారు. కానీ ఈ ప్రమాణం పై ఇప్పటివరకు రెస్పాండ్ కాలేదు ఎమ్మెల్యే రాచమల్లు. మరోవైపు పార్టీ శ్రేణులతో కాణిపాకంకు వెళ్లారు విష్ణు. అయితే కోవిడ్ కారణంగా కాణిపాకం ఆలయంలో సత్య ప్రమాణాలు రద్దు చేసారు. ఇక ప్రస్తుతం కాణిపాకంలో టెన్షన్ కొనసాగుతుంది.

Exit mobile version