NTV Telugu Site icon

Telugu Student murder in Us: తెలుగు విద్యార్ధి దారుణహత్య

విశాఖలో విషాదం నెలకొంది. అమెరికాలో విశాఖపట్నానికి చెందిన తెలుగు విద్యార్థి చట్టూరి సత్యకృష్ణ దారుణహత్యకు గురయ్యాడు.అతడిని తుపాకీతో కాల్చి చంపారు దుండగులు. అతడి స్వస్థలం విశాఖ. నెలరోజుల క్రితమే ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళాడు సత్యకృష్ణ. అలబామాలోని పాత బర్మింగ్‌హామ్ హైవేలోని క్రౌన్ సర్వీస్ స్టేషన్‌లో స్టోర్ క్లర్క్‌గా పనిచేస్తున్నాడు చిట్టూరి సత్య కృష్ణ. అతడి వయసు 27 ఏళ్ళు.

దొంగతనానికి వచ్చిన సాయుధులు దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో సత్య కృష్ణ అక్కడికక్కడే మృతి చెందినట్లు అమెరికా పోలీసు అధికారులు తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం పంపించారు. నెల రోజుల క్రితమే అమెరికా వెళ్లిన సత్య కృష్ణ భార్య నిండు గర్భవతి . కృష్ణ గురించి మరిన్ని వివరాలు అందుబాటులో లేవు. హత్య కు పాల్పడిన నిందితుడి ఫొటోలను అమెరికా పోలీసు శాఖ విడుదల చేసింది.అనుమానితుడు నల్లటి చొక్కా ధరించి ఆరు అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్నాడని కలేరా నగర పోలీసు విభాగం అధికారులు తెలిపారు.