మరికొద్ది గంటల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో ప్రజలకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామన్నారు. కష్టాలను అధిగమిస్తూ సుపరిపాలన అందిస్తామని కేసీఆర్ తెలిపారు. వినూత్న పంథాలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు.
Read Also: రేపటి నుంచి నుమాయిష్ ప్రారంభం
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీఎం జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఏడాది ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని జగన్ ఆకాంక్షించారు. రాష్ట్ర సమ్మిళిత అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. వివక్ష లేకుండా అన్నివర్గాల వారికి తమ ప్రభుత్వం సంక్షేమం అందిస్తోందని సీఎం జగన్ స్పష్టం చేశారు.
