Site icon NTV Telugu

Tollywood: రేపు టాలీవుడ్ ప్రముఖుల భేటీ..

సినిమా టికెట్లతో పాటు.. సినీ పరిశ్రమకు చెందిన ఇతర సమస్యల పరిష్కారానికి ముందడుగు పడింది.. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వంతో చర్చలు గత కొన్ని నెలలుగా కొనసాగగా.. టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి ముందుండి పరిష్కారం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. సినీ పరిశ్రమ తరపున ముందుడి.. ఏపీ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడారు.. ఇక, సీఎం జగన్‌తో ప్రత్యేకంగా సమావేశమైన చర్చించారు.. ఆ తర్వాత చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ తదితరులు కూడా వెళ్లి సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించినందకు సీఎం వైఎస్‌ జగన్‌ను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.. అయితే, ఈ వ్యవహారంలో రేపు టాలీవుడ్ ప్రముఖుల సమావేశం కాబోతున్నారు.. ఉదయం 11 కు హైదరాబాద్‌ ఫిల్మ్ క్లబ్‌లో సమావేశం జరగనుంది.. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ తర్వాత జరుగుతున్న తొలి సమావేశం ఇదే కావడంతో ఆసక్తికరంగా మారింది..

Read Also: KCR: రేపు ముంబైకి తెలంగాణ సీఎం..

రేపు హైదరాబాద్‌లో జరగనున్న ఈ సమావేశంలో తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌, నిర్మాతల మండలి, మా అసోసియేషన్, దర్శకుల సంఘం, చలనచిత్ర కార్మిక సమాఖ్య ప్రతినిధులు పాల్గొనబోతున్నారు.. దాదాపు 240 మందిని ఈ సమావేశం కోసం ఆహ్వానించింది ఫిల్మ్ ఛాంబర్… చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ తదితరులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో సమావేశం తర్వాత జరగనున్న ఈ కీలక సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.. ఇక, సీఎం జగన్‌తో మీటింగ్‌ ముగిసిన తర్వాత మీడియా ముందుకు వచ్చి సినీ స్టార్స్.. సీఎం సానుకూలంగా స్పందించారు. త్వరలోనే మంచి విషయం చెప్తారు. త్వరలోనే జీవో కూడా వస్తుందని ప్రకటించిన విషయం తెలిసిందే..

Exit mobile version