Site icon NTV Telugu

Telugu Desam Party: పెళ్లికొడుకు ఆయనే.. చొక్కా మాత్రం ఆయనది కాదు.. మంత్రి సురేష్‌పై సెటైర్లు

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో విద్యా శాఖ‌కు సంబంధించిన ఓ ప‌థ‌కాన్ని మంత్రి ఆదిమూలపు సరేష్ ప్రస్తావించారు. ఈ వీడియోను ఆధారం చేసుకుని ప్రతిపక్ష పార్టీ టీడీపీ ట్విట్టర్ వేదిక‌గా వ్యంగ్యాస్త్రాలు సంధించింది. దీంతో మంత్రి సురేష్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో విద్యా శాఖకు సంబంధించి తాము పాత ప‌థ‌కాన్నే కొన‌సాగిస్తున్నామ‌ని.. ఆ ప‌థ‌కాన్ని జ‌గ‌న్ తీసుకొచ్చారంటూ మంత్రి సురేష్ అబ‌ద్ధం చెబుతున్నారంటూ టీడీపీ విమర్శలు చేసింది. మంత్రి సురేష్ చెప్పింది ఎలా ఉందంటే… పెళ్లి కొడుకు ఆయనే.. తాను వేసుకున్న చొక్కా మాత్రం ఆయనది కాదు అన్నట్టుగా ఉందని టీడీపీ ఎద్దేవా చేసింది. సీఎం జ‌గ‌న్ కొత్త ప‌థ‌కం తీసుకొచ్చార‌ని చెబుతున్న మంత్రి సురేష్.. డ‌బ్బులు మాత్రం టీడీపీ హ‌యాంలోని పాత ప‌థ‌కం బ‌కాయిలకు క‌డుతున్నామని చెబుతున్నార‌ని ఆరోపించింది.

Exit mobile version