Site icon NTV Telugu

Chandrababu Delhi Tour: చంద్రబాబు ఢిల్లీ బాట.. ఎందుకో తెలుసా..?

Chandrababu

Chandrababu

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు.. ఈ నెల 6వ తేదీ హస్తినకు వెళ్తారు చంద్రబాబు.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల నేషనల్ కమిటీ మీటింగులో పాల్గొనేందుకు ఆయన వెళ్తున్నారు.. కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు సమావేశంలో పాల్గొనబోతున్నారు చంద్రబాబు… ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో ఈ సమావేశం జరగనుంది.. కాగా, 75 ఏళ్ల స్వాతంత్య్ర మహోత్సవాల సందర్భంగా 2023 వరకు ఆజాదీ కా అమృత్ ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయానికి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్.. ఆజాదీ కా అమృత్‌ ఉత్సవాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.. అయితే, గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. తరచూ ఢిల్లీ వెళ్లే.. ప్రధాని, కేంద్రమంత్రులను, అధికారులను అలాగే జాతీయ స్థాయిలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలను ఎన్నో సార్లు కలుస్తూ వచ్చారు చంద్రబాబు.. ఏపీలో వైసీపీ సర్కార్‌ వచ్చిన తర్వాత ఆయన ఢిల్లీ పర్యటనకు చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే వెళ్లారు.

Read Also: Gyanvapi case: జ్ఞానవాపీ కేసులో ముస్లింల తరపు న్యాయవాది గుండెపోటుతో మృతి

Exit mobile version