ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయులకు శుభవార్త చెప్పింది.. బదిలీలు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. రెండు రోజుల పాటు వరుసగా సమావేశాలు నిర్వహించిన మంత్రి బొత్స సత్యనారాయణ, చివరికి టీచర్ల బదిలీలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు.. దీనిపై ఈనెల 12వ తేదీలోపు ప్రకటన విడుదల చేసి, నెల రోజుల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేశారు… ఆన్‌లైన్‌లోనే ప్రక్రియ నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.. ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులు, 8ఏళ్లు ఒకేచోట పని చేస్తున్న ఉపాధ్యాయులకు తప్పనిసరి బదిలీ ఉండబోతోంది.. ఎలాంటి సర్వీసు లేకుండానే బదిలీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించబోతున్నారు.. ఇక, స్పౌజ్, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఇతరత్రా సర్వీసు, పాఠశాలల స్టేషన్ పాయింట్లు గతంలోలాగానే ఉంటాయని చెబుతున్నారు..
Read Also: Viral Video: ఓరి నీ వేషాలో..! మెట్రోలో ఏంటిరా ఇది..
అయితే, రాష్ట్రంలోని పాఠశాలలను టీచర్ల కొతర వెంటాడుతోంది.. దీనిపై ఫిర్యాదులు కూడా ఉన్నాయి.. దీంతో, సర్దుబాటు చేసేందుకు చర్యలు చేపట్టారు విద్యాశాఖ అధికారులు… రాష్ట్ర వ్యాప్తంగా 3-10 తరగతులకు 6,578 మంది, 6-10 తరగతులకు 1,350 మంది సబ్జెక్టు ఉపాధ్యాయులు అవసరమని అంచనా వేశారు.. దీని ప్రకారం ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తారు. సబ్జెక్టు ఉపాధ్యాయులు లేకపోతే అర్హత ఉన్న ఎస్జీటీలను స్కూల్ అసిస్టెంట్లుగా నియమించనున్నారు.. హేతుబద్ధీకరణ కారణంగా మిగులుగా తేలిన ఎస్జీటీలను అవసరమైన చోటుకు పంపించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. కొన్నిచోట్ల 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలించడంతో పాటు అర్హత కలిగిన ఎస్జీటీలను ఆయా బడులకు పంపించబోతున్నారు.. ఇక, ఉపాధ్యాయుల బదిలీల తరువాత జిల్లా విద్యాధికారులకు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నాలుగు డీఈవో పోస్టులు ఖాళీగా ఉండగా.. వాటితో పాటు మరికొన్ని జిల్లాల్లో కొత్తవారిని నియమించాలని నిర్ణయించారు. ఉపాధ్యాయుల బదిలీల అనంతరం ఏర్పడే ఖాళీల్లో డీఎస్సీ-98 అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టుగా చెబుతున్నారు.