AP Teachers Transfers : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు సంబంధించి ముసాయిదా విడుదల చేశారు. ఒకే చోట 8 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న టీచర్లతో పాటు ఐదేళ్ల పాటు సర్వీస్ పూర్తయిన హెడ్ మాస్టర్లకు బదిలీ తప్పనిసరి చేసింది ప్రభుత్వం. నాలుగు కేటగిరి లుగా ఉపాధ్యాయుల విభజన చేశారు. ఈ నెల 7వ తేదీ లోగా ఆన్ లైన్ లో సలహాలు, సూచనలు పంపాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. కొత్త విద్య సంవత్సరం ప్రారంభం అయ్యే లోపు బదిలీ ప్రక్రియ పూర్తి చేయలాని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టీచర్ల బదిలీలకు సంబంధించి కొత్త చట్టం తెచ్చే ఆలోచనలో ఏపీ సర్కార్ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ ముసాయిదా చట్టం–2025 పేరుతో బిల్ తీసుకొచ్చే అవకాశం ఉంది.
Read Also: Shanmukha: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఆది సాయికుమార్ థ్రిల్లర్ మూవీ..
అయితే, జూన్ 1 నుంచి మే 31వ తేదీ వరకు విద్యా సంవత్సరంగా పేర్కొని, దాని ఆధారంగానే టీచర్ల బదిలీలు కొనసాగించే అవకాశం ఉంది. ఉపాధ్యాయులు 9 నెలలు మించిన కాలాన్ని పూర్తి విద్యా సంవత్సరంగా లెక్కిస్తామని చెప్పుకొచ్చింది. అలాగే, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఉంచిన ప్రొఫార్మాను డౌన్‌లోడ్ చేసుకుని పూర్తి వివరాలు నింపి ఈ నెల 7వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా మెయిల్ చేయాలని వెల్లడించింది.