బద్వేల్ బై పోల్.. టీడీపీ స్పెషల్ ఫోకస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా 30 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి.. అధికార వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో బద్వేల్ ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది.. అయితే, మరోసారి విజయంపై కన్నేసిన వైసీపీ.. బద్వేల్ అభ్యర్థిగా డాక్టర్ దాసరి సుధా పేరును ఖరారు చేసింది.. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య సతీమణియే.. డాక్టర్ సుధా.. ప్రస్తుతం కడపలో డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారామె.. ఈ ఏడాది మార్చి 28న అనారోగ్యంతో ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య కన్నుమూయడంతో.. ఆయన సతీమణి సుధాకు టికెట్ ఖరారు చేశారు సీఎం వైఎస్ జగన్.. ఇప్పటికే బద్వేల్ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల్లో అభ్యర్థిగా పరిచయ కార్యక్రమం నిర్వహిస్తున్న ఆమె.. ఇంటింటి పరిచయ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు.
ఇదే సమయంలో.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా బద్వేల్ ఉప ఎన్నికపై ప్రత్యేకంగా దృష్టిసారించింది.. తాజాగా వెలువడిన మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాల్లో ఆ నియోజకవర్గం పరిధిలో పర్వాలేదు అనిపించింది టీడీపీ.. దీంతో.. బద్వేల్ ఉప ఎన్నికల్లో విజయం ఏమో కానీ.. గట్టి పోటీ ఇవ్వగలం అనే ధీమాతో ఉన్నారు ఆ పార్టీ శ్రేణులు.. త్వరలోనే ఆ నియోజకవర్గ నేతలతో సమవేశం కానున్నారు పార్టీ అధినేత చంద్రబాబు.. ఉప ఎన్నికల కోసం ఇంఛార్జ్‌లను నియమించేందుకు ప్లాన్ చేస్తున్నారు.. కాగా, బద్వేల్ నియోజకవర్గంలోనే ఇటీవల స్థానిక ఎన్నికల్లో ఓ ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను కైవశం చేసుకుంది టీడీపీ.. పార్టీ అధినాయకత్వం ఎన్నికలను బహిష్కరించినా.. స్థానిక నేతలు గట్టిగా ప్రయత్నాలు చేసి.. మంచి ఫలితాలను సాధించారు.. దీంతో.. బై పోల్‌పై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నాఉ.. ఫోకస్ పెడితే అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వొచ్చనే లెక్కలు వేస్తున్నారు టీడీపీ నేతలు. ఇప్పటికే డాక్టర్ ఓబుళాపురం రాజశేఖర్‌ని బద్వేల్ అభ్యర్థిగా ప్రకటించింది తెలుగుదేశం పార్టీ.
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!