Site icon NTV Telugu

Devineni Uma: మంత్రులతో పాటు సీఎం కూడా రాజీనామా చేయాల్సింది

ఏపీలో త్వరలో కొత్త కేబినెట్ ఏర్పడనుంది. ఈ మేరకు ప్రస్తుత కేబినెట్ సభ్యులు గురువారం రాజీనామాలు చేశారు. తమ రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు సమర్పించారు. అయితే మొత్తం 24 మంది మంత్రుల రాజీనామాల‌పై టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వర‌రావు తనదైన శైలిలో సెటైర్లు వేశారు. జ‌గ‌న్ కేబినెట్‌లోని 24 మంది అస‌మ‌ర్థులు త‌మ మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేశార‌ని ఆయ‌న విమర్శలు చేశారు.

అయితే మాజీ మంత్రి దేవినేని ఉమా ఓ కొత్త డిమాండ్ వినిపించారు. మంత్రుల మాదిరే సీఎం జ‌గన్ కూడా తన ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. మంత్రులుగా ఇత‌రుల‌కు ఎలా అయితే అవ‌కాశం క‌ల్పిస్తున్నారో.. సీఎంగా కూడా మ‌రొక‌రికి అవ‌కాశం క‌ల్పించాల‌ని ఆయన సూచించారు. కాగా ఇప్పుడున్న మంత్రుల్లో ఐదారుగురు మంత్రులకు మళ్లీ మంత్రి పదవులు రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 10న కొత్త మంత్రుల జాబితాను గవర్నర్‌కు సీఎం జగన్ పంపనున్నారు. ఈనెల 11న కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

https://ntvtelugu.com/botsa-satyanarayana-comments-on-ap-cabinet-reshuffle/

Exit mobile version