చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండడం దౌర్భాగ్యమంటూ వైసీపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలను టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ తిప్పికొట్టారు. ఏపీకి జగన్ లాంటి సీఎం ఉండటమే రాష్ట్రానికి దౌర్భాగ్యమని ఆయన రివర్స్ పంచ్ ఇచ్చారు. వైసీపీ ఎంపీలు చెప్పిన్నట్లు జగన్ ప్రతిపక్ష నేతగా ఉండడమే రాష్ట్రానికి మంచిదన్నారు. ప్రధాన మంత్రిని కలిసిన సీఎం జగన్ ఏం అడిగారని ప్రశ్నిస్తే.. తమను, తమ పార్టీ అధినేత చంద్రబాబును వైసీపీ ఎంపీలు దూషిస్తున్నారని, తిట్టడమే వారి పనిగా పెట్టుకున్నారని ఎంపీ కనకమేడల ఆగ్రహం వ్యక్తం చేశారు
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులపై కాగ్ నివేదికనే తాము చెప్తున్నామని ఎంపీ కనకమేడల గుర్తుచేశారు. ఒకవేళ కాగ్ నివేదిక తప్పయితే దానిని వైసీపీ ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో ఎందుకు ప్రస్తావించడంలేదని ప్రశ్నించారు. కాగ్ అవాస్తవాలు చెప్పిందని వైసీపీ ఎంపీలు నిరూపించాలని సవాల్ చేశారు. చంద్రబాబును దూషిస్తే వైసీపీ ఎంపీలు చెప్పినవి నిజాలు అయిపోతాయా అని ఎంపీ కనకమేడల సెటైర్లు వేశారు. సీఎం జగన్‌కు ఓటమి భయం పట్టుకుంది కాబట్టే చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారని కనకమేడల విమర్శించారు.
https://ntvtelugu.com/central-government-released-879-crores-funds-to-ap-under-revenue-deficit-grant/
