NTV Telugu Site icon

Galla Jayadev: దావోస్ సదస్సులో టీడీపీ ఎంపీ

Galla Jayadev

Galla Jayadev

దావోస్ వేదికగా వ‌ర‌ల్డ్ ఎకాన‌మిక్ ఫోరం స‌ద‌స్సు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సదస్సుకు ఏపీ సీఎం జగన్, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ మిథున్‌రెడ్డి హాజరయ్యారు. ఇప్పుడు ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ కూడా ఈ సదస్సుకు హాజరైనట్లు తెలుస్తోంది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ దావోస్‌లోని ప్రపంచ ఆర్ధిక సదస్సుకు హాజరైనట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి హ‌ర్‌దీప్ సింగ్ పురితో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్‌ ద్వారా పోస్ట్ చేశారు.

CM Jagan: దావోస్‌లో ఏపీ సీఎం.. రెండోరోజు షెడ్యూల్‌ ఇదే..

గ‌ల్లా జ‌య‌దేవ్ టీడీపీ ఎంపీ కాక ముందు నుంచే పారిశ్రామిక‌వేత్తగా కొన‌సాగుతున్నారు. గ‌ల్లా కుటుంబం ఆధ్వర్యంలోనే అమ‌ర్‌రాజ బ్యాట‌రీస్ సంస్థ నడుస్తోంది. ఈ కంపెనీ య‌జ‌మాని హోదాలోనే ఆయ‌న దావోస్ స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యారు. ఎన‌ర్జీ రంగానికి చెందిన ప‌లు ప‌రిశ్రమ‌ల ప్రతినిధి బృందాల‌తో భేటీ కోస‌మే తాను ఈ స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యాన‌ని గల్లా జయదేవ్ వెల్లడించారు. ‘ఎన‌ర్జీ అవుట్‌లుక్‌.. ఓవర్‌క‌మ్ ద క్రైసిస్’ పేరిట సాగిన చ‌ర్చలో పాలుపంచుకున్నట్లు వివరించారు. ఈ సంద‌ర్భంగానే తాను కేంద్ర మంత్రి హ‌ర్‌దీప్ సింగ్ పురిని క‌లిసినట్లు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పేర్కొన్నారు.