Site icon NTV Telugu

చంద్రబాబు టీడీపీ కేడర్‌ను మోసం చేస్తున్నారు : వల్లభనేని వంశీ

ఏపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌ ధరలు తగ్గించాలని బీజేపీ, టీడీపీ నానా యాగీ చేస్తున్నాయి. రూ. 50 ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలను విపరీతంగా పెరిగేలా చేసింది బీజేపీ అని టీడీపీ రెబెల్‌ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. తన హయాంలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరిగాయనే విషయాన్ని అల్జీమర్స్‌ సోకిన చంద్రబాబు మరిచారు. ధర్నాలు పేరుతో చంద్రబాబు కొత్త డ్రామాలాడుతున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల విషయంలో వాస్తవాలు దాచి ధర్నాలు చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. చంద్రబాబుకు కేంద్రం పేరెత్తాలంటే వెన్నులో వణుకు. గడచిన ఎన్నికల్లో మోడీని తిట్టిన తిట్టకుండా తిట్టిన చంద్రబాబు.. ఇప్పుడు ఆయన పేరెత్తే సాహసం చేయడం లేదు. ఎన్నికల్లో ఓడిపోయాక తన ఎంపీలను బీజేపీకి పంపారు చంద్రబాబు.

ఇక తమది జాతీయ పార్టీలు.. అంతర్జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు.. తెలంగాణలో ఎందుకు పెట్రోల్‌ ధరలు తగ్గించాలని ధర్నాలు చేయడం లేదు. తడవకొకరును తెర మీదకు తెచ్చి ఏదో డ్రామాలాడుతున్నారు. ఓసారి నిమ్మగడ్డను తెస్తారు.. మరోసారి ఇంకో గడ్డను తెస్తారు. ఇంగిత జ్ఞానం లేకుండా నోటికొచ్చినట్టు అబద్దాలు చెబుతూ చంద్రబాబు ప్రెస్‌ మీట్లు పెడుతున్నారు. జగన్ ప్రభుత్వం కేవలం రూపాయి మాత్రమే రోడ్‌ సెస్‌ పేరుతో వసూలు చేస్తోంది. చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అల్జీమర్సే కాదు.. పిచ్చిపట్టిందనే నిర్ణయానికి ప్రజలు వస్తారు. తెలంగాణ తరహాలోనే ఏపీలో కూడా చంద్రబాబు టెంట్‌ మూసేస్తారు.. షెడ్‌ తీసేస్తారు. చంద్రబాబు చెప్పాడని పెట్రోల్‌ బంకుల ముందు హరన్‌ కొట్టడం ఏంటీ. కరెంట్‌ ఛార్జీలు పెరిగాయని కరెంట్‌ తీగలు.. ట్రాన్సఫార్మర్లు పట్టుకోమంటే పట్టుకుంటారా అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో ప్రజల నుంచి వసూల్‌ చేసిన సెస్‌ను పోలవరంలో పులిహోరకు ఖర్చు పెట్టారు. చంద్రబాబు తెలుగుదేశం కేడర్‌ను మోసం చేస్తున్నారు అని పేర్కొన్నారు.

Exit mobile version