Site icon NTV Telugu

వైసీపీ పాలనను RRR మూవీ సాంగ్‌తో పేరడీ చేసిన టీడీపీ ఎమ్మెల్యే

ఏపీలో వైసీపీ ప్రభుత్వ పాలనపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆర్.ఆర్.ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్‌ను పేరడీ చేశారు. ఈ సాంగ్‌ను వైసీపీ సర్కారు పాలనతో లింకు పెడుతూ.. నా పాలన సూడు.. నా పాలన సూడు.. వేస్టు వేస్టు.. వేస్టు వేస్టు అంటూ ఎద్దేవా చేశారు.

Read Also: కావాలంటే నా సినిమాలను ఏపీలో ఉచితంగా ఆడిస్తా: పవన్ కళ్యాణ్

‘అప్పులోళ్ళ ఖాతాల్లో వడ్డీ రేట్లు పెరిగినట్టు.. పోలవరం డ్యామ్ కోసం బెట్టింగ్ రాజు ఊగినట్టు.. నోటి బురద మాటలతో గుడివాడలోన ఎగిరినట్టు.. ప్రత్యేక హోదా నీడలోన రాజకీయం చేసినట్టు.. ఎన్నికల హామీలు కొండఎక్కించినట్టు.. నా పాలన సూడు, నా పాలన సూడు, నా పాలన సూడు.. వేస్టు.. వేస్టు.. వేస్టు.. సుద్ద వేస్టు..’ అంటూ బుచ్చయ్య చౌదరి తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా జగన్‌కు చెందిన సాక్షిపైనా ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి సెటైర్లు వేశారు. వేస్టు.. వేస్టు… పిచ్చ వేస్టు.. వేస్టు.. యక్షి న్యూస్ లాగా పిచ్చ వేస్టు.. అంటూ సాక్షిని ఉద్దేశించి ట్వీట్ చేశారు. చివర్లో ‘జ’నంతో… ’జ’గన్నటక…’జై’లు పక్షి అంటూ పేర్కొన్నారు.

Exit mobile version