Site icon NTV Telugu

ఆదానికి రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు. : గోరంట్ల బుచ్చయ్య చౌదరి

gorantla-butchaiah-chowdary

gorantla-butchaiah-chowdary

ఓటీఎస్ పేరుతో పేద ప్రజలను ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది అని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. గత ప్రభుత్వాలు పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చాయి. రూ. 6 వేల కోట్ల దోపిడీ లక్ష్యంగా ఓటీఎస్ అమలుకు ప్రయత్నం చేస్తుంది. డ్వాక్రా గ్రూపుల నుంచి మహిళ పొదుపు సొమ్ము కూడా బలవంతంగా ప్రభుత్వం లాక్కుంటుంది.జగనన్న కాలనీలను అభివృద్ధి చెయ్యడం చేతకాని ప్రభుత్వం .. పేదలను ఓటీఎస్ పేరుతో పీడిస్తుంది. ఆంధ్రప్రదేశును అమ్మకానికి పెట్టారు.. ఆదానికి రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు. శాడిస్ట్ ప్రభుత్వం ఇది.. ఏపీలో శాడిస్ట్ పాలన కొనసాగుతుంది. సీఎం బటన్ నొక్కుతారు.. కానీ అకౌంట్లల్లో డబ్బులు పడవు.. డబ్బా కొట్టుకోవడం తప్ప.. రాష్ట్రంలో సంక్షేమం లేదు అని తెలిపారు.

అయితే సీఎం జగన్ చెప్పేది ఒకటి….చేసేది ఒకటి. ప్రజల్లో తిరుగుబాటు మొదలయ్యింది. రాష్ట్రం చిన్నాభిన్నం అయ్యింది. ఓటీఎస్ ప్రోగ్రాంను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి. పెన్షన్, రేషన్ కట్ చేస్తాం అంటే ఎలా..? ఓటీఎస్ కోసం ఒత్తిడి తెస్తున్నారని నేను నిరూపిస్తా… బొత్స రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. కోట్లాది సోమ్మును ఓటీఎస్ ద్వారా ప్రజల నుంచి తీసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు… గౌరవ సభలు ఒక్క ఇష్యూ పైనే కాదు.. అన్ని సమస్యలపై పోరాటం. చట్టసభల్లో జరిగిన ఘటనకు సీఎం జగన్ స్వయంగా అక్కడే క్షమాపణ చెప్పాలి అని పేర్కొన్నారు.

Exit mobile version