Site icon NTV Telugu

టీడీపీ 150 సీట్లు గెలుస్తుంది : అచ్చెన్నాయుడు

టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్య‌వ‌ర్గ ప్ర‌మాణ స్వీకారం కార్య‌క్ర‌మంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు. అచ్చెన్నాయుడు, పార్టీ నేత‌లు పాల్గొన్నారు. అక్కడ అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… ఒక్క అవ‌కాశం అంటూ ద‌రిద్రాన్ని తెచ్చుకున్నారు. పాఠ‌శాల‌ల్లో నాడు నేడు పేరుతో వేల కోట్ల అవినీతి జ‌రుగుతుంది. పాఠ‌శాల‌ల్లో రూ. 10 ప‌నికి రూ. 100 కొట్టేశారు. పేద‌ల‌కు ప‌ట్టాల పేరుతో ఓటిఎస్ అంటూ రూ. 5 వేల కోట్లు వ‌సూలు చేసేందుకు సిద్దమయ్యారు. విదేశీ విద్యాదీవ‌న‌ ప‌థకాన్ని మ‌ధ్యలో నిలిపి వేస్తారా.. విదేశాల్లో ఉన్న విద్యార్థుల‌ను ఏమ‌వ్వాలి అని ప్రశ్నించారు.

స్వాతంత్య్రం వ‌చ్చిన త‌రువాత రాష్ట్రం మూడు ల‌క్ష‌ల కోట్లు అప్పుచేస్తే.. జ‌గ‌న్ మూడేళ్లు కాకుండా 3 ల‌క్ష‌ల కోట్ల అప్పు చేశారు. అప్పు తెచ్చిన మూడు ల‌క్ష‌ల కోట్ల‌లో ల‌క్ష‌న్న‌కోట్లు మౌలిక స‌దుపాయాల‌కు ఖ‌ర్చు పెడితే ఉపాధి వ‌చ్చేది. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌పై లోకేష్ నాయ‌క‌త్వంలో టిఎన్ఎస్ఎఫ్ తిరుగు లేని పోరాటం చేసింది. జ‌గ‌న్ ఎవ‌రిపై ఎన్ని కేసులు పెడితే.. వారు అంత పెద్ద నాయ‌కులనుకోవాలి. కార్య‌క‌ర్త‌లు, నేత‌లు ఈ ప్ర‌భుత్వంపై పోరాటంలో జైల‌కు వెళ్ల‌డానికి సిద్ద ప‌డాలి. ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా టీడీపీ 150 సీట్లు గెలుస్తుంది అని తెలిపారు. మారువేషంలో వెళ్లి వైసీపీ ఎమ్మెల్యేని అడిగినా టీడీపీ గెలుస్తుందని చెపుతారు రాష్ట్రంలో అంత హింస పెడుతున్నారు. నాడు నాలుగున్నర లక్షల ఉద్యోగలన్న జగన్.. ఇప్పుడు జాబ్ లెస్ క్యాలెండర్ ఇచ్చాడు అని పేర్కొన్నారు.

Exit mobile version