Site icon NTV Telugu

Yanamala Ramakrishnudu: తప్పులు, అప్పులు కప్పిపుచ్చుకునేందుకు జగన్ తంటాలు

Yanamala

Yanamala

ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు (yanamala Ramakrishnudu). తప్పులు, అప్పులు కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ (Ysrcp) తంటాలు పడుతుంది. వైసీపీలో అవినీతి, తప్పుడు ఆలోచనలే. యువత భవిష్యత్తును అగమ్యగోచరంలోకి నెట్టిన ఘనుడు జగన్. జగన్ మోహన్ రెడ్డి (Jaganmohan Reddy) తెచ్చిన అప్పులు వారి స్వార్థానికి వాడుకుంటున్నారు. రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలంటే జగన్ కు గుణపాఠం చెప్పాలి. జగన్ మోసాలను చూస్తూ ఊరుకుంటే భవిష్యత్ ఉండదన్నారు యనమల. మూడున్నరేళ్లల్లో దాదాపు రూ.1,96,165 కోట్లు అప్పు చేశారు.

Read Also: India vs Pakistan: దీపావళి ధమాకా.. విరాట్ విశ్వరూపం.. పాక్‌పై భారత్ విజయం

అసెంబ్లీ ఆమోదించిన దాని కంటే ఎక్కువ అప్పులు చేశారు. చేసిన అప్పులను దుర్వినియోగం చేశారని స్పష్టంగా తెలుస్తోంది. అప్పులపై శ్వేతపత్రం (white paper) విడుదల చేయమంటే ఎందుకు చేయడం లేదు..? జగన్ ప్రభుత్వం చేసే అప్పులకు ఎలాంటి చట్ట భద్ధత లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు యనమల రామకృష్ణుడు. ఏపీ ప్రభుత్వం తీరుపై టీడీపీ మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. పథకాల పేరుతో అడ్డదిడ్డంగా అప్పులు చేయడం రాష్ట్రానికి మంచిది కాదని యనమల మొదటినుంచీ వాదిస్తున్నారు.

Read Also: Nadendla Manohar: ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పేరుతో జనసేనపై మరో కుట్ర

Exit mobile version