Site icon NTV Telugu

Yanamala Ramakrishnudu: అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు.. నియంత పోకడలు

Yanamala

Yanamala

ఏపీ అసెంబ్లీ సమావేశాల తీరుపై మండిపడ్డారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు. అసెంబ్లీకి అబద్దాలు చెప్పిన జగనుకి ప్రివిలేజ్ నోటీసులివ్వాలి.ఏకపక్షంగా సభ నిర్వహణ ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి నియంతృత్వానికి ప్రయత్నాలు దుర్మార్గం. ప్రజాస్వామ్యంలో శాశ్వత అధ్యక్షులు ఉండరు. చట్ట సభల ప్రతిష్టకు, గౌరవానికి మచ్చ తెచ్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ట్రెజరీ నియమావళీ పాటించకుండా కేవలం ప్రభుత్వ ఉత్తర్వులతోనే రూ.26,839 కోట్లు చెల్లించారు.

రూ.9,124 కోట్లకు సంబంధించి ఆర్ధిక శాఖ వద్ద వివరణే లేదు. కనీసం జీవోలు కూడా విడుదల చేయకుండా రహస్యంగా రూ.8,891 కోట్లు విడుదల చేయాల్సిన అవసరం ఏంటి? ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కు ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం వెనుక ఏ శక్తి పనిచేస్తుంది? గత ఐదేళ్ల కంటే 20-21లో అతి తక్కువ వృద్ధిరేటు నమోదైందని కాగ్ స్పష్టం చేసింది. రెవెన్యూ లోటు రూ.35,541 కోట్లతో ఐదేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇది గతేడాదితో పోల్చితే 34.42 శాతం పెరిగింది.

Read Also: Congress President Poll : ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

ద్రవ్యలోటు 39.01 శాతం నుంచి 59.53 శాతానికి చేరుకుంది. రూ. 6, 278 కోట్లు రెనెన్యూ వ్యయాన్ని మూలధన వ్యయంగా చూపారన్నారు యనమల. సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చామని చెప్పుకునే జగన్ రెడ్డికి స్థానిక సంస్థల గురించి మాట్లాడే అర్హత లేదు. పంచాయతీలకు సంబంధించిన రూ.854 కోట్లు 14 వ ఆర్దిక సంఘం నిధులు కొల్లగొట్టారు. కేంద్ర పథకాలకు రాష్ట్రం తన వాటా ఇవ్వడం లేదు. రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మంది గర్బిణులు ప్రధానమంత్రి మాతృ వికాస యోజన కింద ఇచ్చే రూ.5 వేలు కోల్పోయారు. ఇదేనా మీరు సాధించిన అభివృధ్ది..?అని ప్రశ్నించారు యనమల.

Read Also: Heavy rain in Hyderabad: బంగాళాఖాతంలో అల్పపీడనం.. హైదరాబాద్‌ పలు ప్రాంతాల్లో వర్షం

Exit mobile version