Site icon NTV Telugu

Pattabhi: సీబీఐ కోర్టు అనుమతులను జగన్ ఉల్లంఘించారు

Pattabhi

Pattabhi

ఏపీ సీఎం జగన్ దావోస్ పర్యటన వివాదాస్పదంగా మారింది. సీబీఐ కోర్టుకు జగన్ ముందుగా చెప్పినట్లు నేరుగా స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ వెళ్లకుండా లండన్‌లో ల్యాండ్ కావడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ అంశాన్ని టీడీపీ వదిలిపెట్టడం లేదు. దండుకున్న అవినీతి సంపదను దాచుకోవడానికే జగన్ లండన్‌ వెళ్లారని శనివారం టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా టీడీపీ నేత పట్టాభి కూడా జగన్ లండన్ టూర్‌పై విమర్శల వర్షం కురిపించారు.

Minister Kakani Govardhan Reddy : చంద్రబాబు అల్జీమర్స్.. లోకేష్‌ పరిణితి చెందని పుత్రుడు

సీఎం జగన్ సీబీఐ కోర్టు అనుమతులు ఉల్లంఘించి లండన్‌ వెళ్లారని టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు. జగన్‌తో పాటు విమానంలో ఏపీకి చెందిన అధికారులు ఎందుకు వెళ్లలేదని ఆయన నిలదీశారు. ఇస్తాంబుల్‌ ఎయిర్‌పోర్టులో 2 గంటలు మాత్రమే పట్టిందని… జగన్‌ లండన్‌ వెళ్లాలని ముందుగానే నిర్ణయించుకున్నారని విమర్శించారు. ఈ విషయంలో వైసీపీ మంత్రులు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనకు జగన్ విలాసవంతమైన విమానంలో ఎందుకు వెళ్లారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముందస్తు ఎన్నికల ప్రచారం వేళ దాచిన డబ్బు తేవడానికే జగన్‌ దావోస్‌ వెళ్లారని పట్టాభి అనుమానం వ్యక్తం చేశారు.

Exit mobile version