NTV Telugu Site icon

అధికారులా.. ఎమ్మెల్యే కేతిరెడ్డి బంట్రోతులా.. ?

అనంతపురం జిల్లా ధర్మవరం లోని కూరగాయల మార్కెట్ ను పరిశీలించారు టీడీపీ ధర్మవరం ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరాం, హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు బీకే పార్థసారథి. ధర్మవరం నడిబొడ్డున ఉన్న కూరగాయల మార్కెట్ ను రాత్రికి రాత్రే కూల్చివేసిన మునిసిపల్ అధికారుల తీరుపై శ్రీరాం మండిపడ్డారు.

మార్కెట్ సమస్యలు మార్కెట్ లో కాకుండా ఎమ్మెల్యే ఇంట్లో పరిష్కారిస్తున్నాడా..?అధికారులను ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బంట్రోతుల్లా మార్కెట్ మీదకు వదిలాడు. అధికారులు ఎమ్మెల్యే కంట్రోల్ లో పని చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు.

ఇక్కడ జరిగే అభివృద్ధికి మేము ఎప్పుడూ వ్యతిరేకం కాదు అరాచకాలకు వ్యతిరేకం అన్నారు. ఇన్ని రోజులు రాజకీయం వద్దు అనుకున్నాం. ఇప్పుడు రాజకీయం చేయటానికి సిద్ధంగా ఉన్నాం. సామాన్యులకు కష్టం వస్తే తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందన్నారు. మార్కెట్లో నష్టపోయిన బాధితులకు రూ.10 లక్షల నష్ట పరిహారం ప్రకటించాలని పరిటాల శ్రీరాం డిమాండ్ చేశారు.