ఏపి, తెలంగాణల మధ్య తాజా జలవివాదం రోజు రోజు ముదురుతోంది. అయితే.. ఈ వివాదంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ అంటే తనకు అమితమైన అభిమానమని… వైఎస్సార్ చనిపోతే తాను ఏడ్చానని.. ఆయన తనకు మంచి ఆప్తుడని వెల్లడించారు. రాజశేఖర్ రెడ్డి పలకరింపులోనే ఆప్యాయత ఉందని.. అలాంటి వ్యక్తి ని రాక్షషుడు అని సంబోధిస్తున్నారని ఫైర్ అయ్యారు.
read also : కేంద్ర మంత్రులకు సీఎం జగన్ లేఖలు..
వైఎస్ ను బండ బూతులు తిడుతుంటే.. ఏపీ మంత్రులు గాజులు తొడుక్కున్నారా ? అని ప్రశ్నించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. 10 ఏళ్ళు అయింది వైఎస్ చనిపోయి.. దయచేసి ఆయనను తిట్టకండని విజ్ఞప్తి చేశారు. ఏపీ మంత్రుల నోళ్లు ఏమయ్యాయి… టీడీపీ ని తిట్టదానికేనా మీరు ఉన్నది అంటూ ఫైర్ అయ్యారు. హైదరాబాద్‌లో సెటిలర్స్ ఎవరు అని నిలదీసిన ఆయన.. తమ పిల్లలు హైదరాబాద్‌లోనే పుట్టారని.. అక్కడే చదువుకున్నారని పేర్కొన్నారు. ఇక్కడ ప్రజలు హైదరాబాద్‌కు వెళ్లి షాపింగ్స్ చేస్తున్నారని తెలిపారు.
