Site icon NTV Telugu

సీఎం జగన్‌కు టీడీపీ నేత ధూళిపాళ నరేంద్ర లేఖ…

ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ నేత ధూళిపాళ నరేంద్ర లేఖ రాసారు. ఇది రైతు ప్రభుత్వమా..? దగా ప్రభుత్వమా అంటూ ధూళిపాళ బహిరంగ లేఖలో ప్రశ్నించారు. ఆ లేఖలో… విద్యుత్‌ మోటార్లకు మీటర్లు బిగించడం ద్వారా రైతుల్ని దొంగల్లా చూస్తున్నారన్న భావన కల్పిస్తున్నారు. రైతు భరోసా అమల్లో కులం పేరు చెప్పి లబ్దిదారుల్లో కోత విధించారు. రైతు భరోసా లబ్దిదారులను 64 లక్షల నుంచి 45 లక్షలకు కుదించారు. 15 లక్షల కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని.. 49 వేల మందికే పరిమితం చేశారు అని తెలిపారు. అలాగే పోలవరం నీటి సామర్ధ్యం ఎత్తును 150 అడుగుల నుంచి 135 అడుగులకు కుదించేశారు. డ్రిప్‌ ఇరిగేషన్‌, వ్యవసాయ యాంత్రీకరణ, మైక్రో న్యూట్రీయంట్స్‌ వంటి వాటిని పూర్తిగా వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టేసింది అని పేర్కొన్నారు. ఇక చూడాలి మరి వైసీపీ నేతలు ఈ లేఖ పై ఎలా స్పందిస్తారు అనేది.

Exit mobile version