NTV Telugu Site icon

Buddha Venkanna: గుట్కా నానికి మతి భ్రమించింది

Nani 1

Nani 1

ఏపీలో అధికార వైసీపీ-విపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani)-టీడీపీ నేత బుద్ధా వెంకన్న (Buddha Venkanna) మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. గుట్కా నానికి మతి భ్రమించిందన్నారు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న. గుట్కా నాని గురించి గుడివాడ బస్టాండు (Gudivada Busstand) లో ఎవరిని అడిగినా చెప్తారు.అప్పుల ఊబిలో ఉన్న నాని ఇప్పుడు రూ. 100 కోట్లు ఎలా సంపాదించారు..?చంద్రబాబు, లోకేషుని నాని తిడుతున్నాడు.జె టాక్స్ వేయకుండా జగన్ నానికి డబ్బులు దోచుకోమని అవకాశం ఇచ్చారు.

Read Also: Hijab Row: హిజాబ్‌ అంశంపై సుప్రీం అస్పష్ట తీర్పు.. విస్తృత ధర్మాసనానికి బదిలీ!

గుట్కా నాని వైసీపీలో ఒక పెయిడ్ వర్కర్.నానిని చూసి గుట్కా అమ్మే షాప్ వాడు కూడా చీదరించుకుంటున్నాడు.నాని ప్రతి దానిని వ్యాపార కోణంలోనే చూస్తాడు.నానిని తెలుగు రాష్ట్రాల వారు పిచ్చి వాడిలా చూస్తున్నారు.ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం కాకుండా వారి ఆస్తులు పెంచుకోవడానికి బొత్స, ధర్మాన,అమర్నాధ్ వంటి వారు టీడీపీపై, రైతుల పాదయాత్రపై విమర్శలు చేస్తున్నారు.ముందు ఒక రాజధాని (Ap capital) కట్టి తర్వాత 30 రాజధానులు కట్టుకోవచ్చు. అమరావతి రైతుల పాదయాత్ర (Amaravati Farmers Mahapadayatra) ను ఆపే శక్తి మంత్రులకు ఉందా..?విశాఖను అమ్మేసిన విజయసాయిరెడ్డిపై మంత్రులు పోరాటం చేయాలన్నారు బుద్దా వెంకన్న.

Read Also: Viral Video: టేకాఫ్ అవుతుండగా ఊడిపడిపోయిన విమాన చక్రం.. మరి ప్రయాణికులు..!

Show comments