టీడీపీ ఆవిర్భావ వేడుకలను వివిధ దేశాల్లో జరుపుకుంటున్నారు ఎన్ఆర్ఐలు. 40 దేశాల్లో టీడీపీ ఆవిర్భావ వేడుకలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు ఆయా దేశాల్లో స్థిరపడిన టీడీపీ అభిమానులు, కార్యకర్తలు. విదేశాల్లో ఉన్న టీడీపీ అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు వారికి ధన్యవాదాలు తెలిపారు.
తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో టీడీపీ పుట్టింది. సంక్షేమానికి ఆద్యుడు ఎన్టీఆర్. తెలుగు చరిత్ర చదవాలంటే టీడీపీ ఆవిర్భావానికి ముందు.. ఆవిర్భావం తర్వాత అని చదవాల్సిందే. పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు వంటి సంస్కరణలు తెచ్చారు ఎన్టీఆర్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న ఫుడ్ సెక్యూర్టీ విధానాన్ని రూ. 2కే కిలో బియ్యం పథకంతో ఎన్టీఆర్ ఎప్పుడో అమల్లో పెట్టారు.
ఎన్టీఆర్ ఆశయాలు.. ఆలోచనలకు అనుగుణంగా పార్టీని బలోపేతం కానుంది. పార్టీ స్థాపించిన మూహుర్త బలం గొప్పది. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా తట్టుకుని నిలబడుతుంది. ఎంత మంది పార్టీని ఇబ్బందుల్లో పెట్టాలని ప్రయత్నించినా రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తుంది. ఎవరు ఏ దేశంలో ఉన్నా.. రాష్ట్ర భవుష్యత్తుకు ఎన్ఆర్ఐలు సహకరించాలన్నారు చంద్రబాబు.
ఎన్నారై తెలుగుదేశం అమెరికా విభాగం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించారు. అమెరికా వ్యాప్తంగా 40 నగరాల్లో టీడీపీ ఆవిర్బావ దినోత్సవాలు. ప్రవాస భారతీయుల ఆధ్వర్యంలో విదేశాల్లో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవాలు జరిగాయి. అమెరికా వీధుల్లో భారీగా కార్ల ర్యాలీ నిర్వహించారు టీడీపీ అభిమానులు.
