Site icon NTV Telugu

Tata Group Chairman Meet AP CM: రేపు సీఎం చంద్రబాబుతో టాటా గ్రూపు ఛైర్మన్ భేటీ..!

Ap Cm

Ap Cm

Tata Group Chairman Meet AP CM: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమలు ఏర్పాటు చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోకస్ పెట్టారు. పెట్టుబడుల సాధనే ప్రధాన లక్ష్యంగా దాదాపు ఆరేడు శాఖల్లో కొత్త పాలసీల రూపకల్పనపై కసరత్తు మొదలెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. పారిశ్రామిక వేత్తల్లో నమ్మకాన్ని కలిగించి రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు విస్తృత ప్రయత్నాలు జరుపుతున్న ముఖ్యమంత్రి.. ఒక వైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, మరోవైపు ప్రైవేటు సంస్థల ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడుల తెచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

Read Also: Monkeypox: మంకీపాక్స్ వైరస్ కారణంగా ఆ దేశంలో 548 మంది మృతి..

ఇక, రేపు ముఖ్యమంత్రి చంద్రబాబుతో టాటా గ్రూపు ఛైర్మన్ నజరాజన్ చంద్రశేఖరన్ భేటీ కానున్నారు. సీఎం నివాసంలో ఉదయం 10.30 గంటలకు సమావేశం కానున్నారు. అనంతరం ముఖ్యమంత్రితో సీఐఐ ప్రతినిధుల బృందం మీట్ కాబోతున్నారు. సీఐఐ డీజీ చంద్రజిత్ బెనర్జీ నేతృత్వంలో ముఖ్యమంత్రితో సీఐఐ ప్రతినిధులు సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం తీసుకురానున్న నూతన పారిశ్రామిక విధానంపై సీఐఐ ప్రతినిధులతో ఏసీ సీఎం చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు.

Exit mobile version