Site icon NTV Telugu

Tammineni Sitaram: పార్టీకోసం పని చేయమంటే చేస్తా!

ఏపీలో అన్నివర్గాలకు కేబినెట్ విస్తరణలో న్యాయం చేశారని వైసీపీ నేతలు అంటున్నారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అనంతనం కీలక వ్యాఖ్యలు చేశారు శాసనసభాపతి తమ్మినేని సీతారాం. సీఎం జగన్ ఆదేశిస్తే పార్టీ కోసం పని చేస్తానంటూ స్పీకర్ తమ్మినేని అన్నారు. నాయకుడికి నేను సమస్య కాకూడదు. ఎక్కడ ఉండమంటే అక్కడుంటా. పార్టీకోసం పని చేయమంటే చేస్తానన్నారు.

సహజంగానే ఆశావహులు ఉంటారు. ఏపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఉద్యమం వచ్చింది. ఈ సామాజిక న్యాయ విప్లవం ముందు ప్రతిపక్షాలు కొట్టుకుపోవాల్సిందే. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు డిపాజిట్లు లేకుండా పోతాయి. నాకు కేబినెట్లో అవకాశం ఇస్తారని నేను ఏనాడూ అనుకోలేదు. బీసీ వర్గానికి చెందినవాడిగా ఇది ఒక గొప్ప కేబినెట్ అంటున్నా. రేపు రాబోయే సామాజిక న్యాయం గొప్పది. జగన్మోహన రథచక్రాల క్రింద ప్రతిపక్షాలు నలిగిపోవాల్సిందే.

బలహీన వర్గాలు చరిత్రలో చెప్పుకోదగిన రోజు. అగ్రకుల ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాలను వెన్నుతట్టి లేపారు. పాదయాత్రలో నా గెలుపు అవసరం అని జగన్ అన్నారు. కేబినెట్ కూర్పు అంత సులువేం కాదన్నారు స్పీకర్ తమ్మినేని. కేబినెట్ కూర్పు సీఎం విచక్షణాధికారం. కేబినెట్లో ఉండాలి అని నన్ను అందరూ అడిగారు. సీఎం కాదని చెప్పడానికి కొంత ఇబ్బంది పడ్డారు. అంత చీప్ నా కొ…లు అని నేను అనచ్చా. అచ్చెన్నాయుడు జరిగినవి సింహావలోకనం చేసుకోవాలి. అవినీతి ఆరోపణలు ఎవరిపై వచ్చాయో అచ్చెన్నాయుడు చూసుకోవాలన్నారు.

https://ntvtelugu.com/omicron-new-variant-cases-in-telangana/

యనమల ఎవరు మాకు చెప్పడానికి.. సీఎం జగన్ కి తెలుసు ఏం నిర్ణయించాలో..? కళింగ కమ్యూనిటీ నుంచీ నేను శాసన సభాపతిగా ఉన్నాను.. చాలదా..? మాకు లేని బాధ మీకేమయ్యా..? అని టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. సీఎం జగన్‌ని రక్షించుకోవాల్సిన కర్తవ్యం అణగారిన వర్గాల మీద ఉంది. అన్ని రంగాలలో సీఎం చొరవ మా పిల్లల భవిష్యత్తు కోసమే. వీరోచిత పోరాటానికి మేం నడుం బిగిస్తున్నాం. మనసుతో పాలించగలిగే సీఎం జగన్. పాదయాత్ర తరువాత సంస్కర్తగా మారారు సీఎం జగన్. సీఎం జగన్ ఒక సామాజిక సంఘ సంస్కర్త. సీఎం జగన్ చేసి చూపిస్తారు. మాజీ హోంమంత్రి నాకు రాజీనామా లేఖ పంపలేదన్నారు.

Exit mobile version