ఏపీ సీఎం జగన్ మంత్రి వర్గ విస్తరణ చేపట్టేందుకు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రివర్గ విస్తరణతో పాటు ఏపీలో అభివృద్ధి పనులపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. మా పై విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలు మేం చేయలేక పోతే మీరు వచ్చి చేయవచ్చు కదా అని ఆయన సవాల్ విసిరారు. బీజేపీ నేతలు కబుర్లు కాదు కేంద్రం నుండి డబ్బులు పట్టుకుని రండి అని ఆయన మండిపడ్డారు.
ప్రాజెక్ట్‌ల నిర్మాణం తరువాత.. ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మడం ఆపమనండి సోము వీర్రాజుని, బీజేపీ నేతలను అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంత్రివర్గంలో స్థానం ఎవరికి ఇవ్వాలనేది సీఎం ఇష్టమని, పథకాల క్యాలెండర్ ఇచ్చారని, ఏ లబ్ది దారుడిని అడిగినా చెపుతారు పథకాలు వస్తున్నాయో లేదో అని ఆయన వ్యాఖ్యానించారు. విపక్షాల విమర్శలకు స్పందించమని ఆయన స్పష్టం చేశారు. మాట ఇచ్చిన ప్రకారం కార్యక్రమాలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
