NTV Telugu Site icon

Tagore Scene: ఠాగూర్ సీన్ రిపీట్.. చనిపోయిన మహిళ బ్రతికే ఉందని నమ్మించి..

Tagore Scene In Anangapur

Tagore Scene In Anangapur

Tagore Hospital Scene Repeat In Anantapur Hospital: మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఠాగూర్’ సినిమాలో ఆసుపత్రిలో సీన్ గుర్తుందా? అదే చనిపోయిన వ్యక్తి బ్రతికే ఉన్నాడని నమ్మించి, కొన్ని గంటల పాటు చికిత్స చేసి, చివరికి చనిపోయాడని ఆసుపత్రి వర్గాలు నాటకమాడుతాయి కదా! సరిగ్గా అలాంటి సన్నివేశమే అనంతపురంలో చోటు చేసుకుంది. చనిపోయిన మహిళ బ్రతికే ఉందని నాలుగు గంటల పాటు ఓ ఆసుపత్రి సిబ్బంది నాటకం ఆడింది. తీరా పోలీసులు సీన్‌లోకి వచ్చాక.. అసలు గుట్టు బట్టబయలు అయ్యింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

Riti Saha : విశాఖలో సంచలనం రేపుతున్న వెస్ట్ బెంగాల్ విద్యార్థిని అనుమానస్పద మృతి కేసు

కర్నూలు జిల్లాకు చెందిన మోదీన్‌బీ (32)కి అనంతపురం జిల్లాలోని పీసీ ప్యాపిలికి చెందిన కానిస్టేబుల్‌ వన్నూరుస్వామితో ఏడేళ్ల క్రితం పెళ్లయ్యింది. అయితే.. ఇన్ని సంవత్సరాలు అవుతున్నా, పిల్లలు కలగలేదు. దీంతో.. పిల్లల కోసం అనంతపురంలోని ఓ ఆసుపత్రి గైనకాలజిస్టును సంప్రదించారు. ఆమె ఐవీఎఫ్‌ ద్వారా సంతానం కలిగేలా చికిత్స చేస్తానని నమ్మబలకడంతో, కుటుంబ సభ్యులు ఆమె మాటలు నమ్మారు. ఏవేవో టెస్టుల పేర్లు చెప్పి.. మూడు నెలలుగా ఆసుపత్రి సిబ్బంది చికిత్స అందించారు. మంగళవారం మధ్యాహ్నం సర్జరీ కోసమని మోదీన్‌బీని ఆపరేషన్‌ థియేటర్‌కు తీసుకెళ్లారు.

Crime News: పెళ్లయి రెండేళ్లు అవుతున్నా.. పిల్లలు కలగడం లేదని..

లోపలికి తీసుకెళ్లి ఆమెకు మందు ఇవ్వగా.. నిమిషాల వ్యవధిలోనే అది వికటించి మృతి చెందింది. ఈ విషయం తెలిస్తే కుటుంబ సభ్యులు నానా రాద్ధాంతం చేస్తారని భయపడి.. గంటపాటు అలానే ఉంచారు. ఆ తర్వాత లోపలికి పిలిచి.. మోదీన్‌బీకి మూర్ఛ వచ్చిందని, పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని, వెంటనే బెంగళూరుకు తీసుకొని వెళ్లాలని ఆసుపత్రి సిబ్బంది చెప్పింది. ఆమె బ్రతికే ఉందని నమ్మించేందుకు.. ఆక్సిజన్‌ను కృత్రిమంగా పంపింగ్‌ చేస్తూ నాటకం ఆడాడు. ఇలా 4 గంటల పాటు ఆ మహిళ మృతి చెందిన విషయం చెప్పకుండా ఆపరేషన్‌ థియేటర్‌లోనే నాటకం ఆడారు.

Bigg Boss Telugu Season 7 : సడెన్ గా బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇస్తున్న ఆ క్రేజీ హీరోయిన్…?

ఇక పరిస్థితి చెయ్యి దాటిపోయిందనుకున్న ఆసుపత్రి సిబ్బంది.. రాత్రి 7:45 గంటలకు సేఫ్టీ కోసం పోలీసుల్ని పిలిపించి, మోదీన్‌బీ చనిపోయినట్లుగా కుటుంబసభ్యులకు తెలియజేశారు. మృతురాలు గుత్తి మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ వన్నూరమ్మ మేనకోడలు కావడంతో.. బంధువులు పెద్దఎత్తున ఆసుపత్రికి తరలివచ్చారు. ఆసుపత్రిలోని ఐసీయూ గదిని ధ్వంసం చేయడంతో పాటు అద్దాలు పగులకొట్టారు. వైద్యులు, పోలీసులపై కూడా ఎటాక్ చేశారు. చివరికి సీఐలు, ఎస్సైలు రంగంలోకి దిగి.. పరిస్థితిని అదుపు చేశారు. బంధువు మాత్రం.. ఆసుపత్రిని సీజ్‌ చేయాలని బంధువులు డిమాండ్‌ చేస్తున్నారు.