అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఆలూరు రంగనాథ స్వామి తిరునాళ్లలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తిరునాళ్లకు వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఒకే సమయంలో వచ్చారు. అయితే ఈ విషయాన్ని గమనించిన పోలీసులు జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఆపి కాసే ఆగి వెళ్లాలని సూచించారు. పెద్దారెడ్డి వెళ్లిపోయిన తర్వాత జేసీని అనుమతిస్తామని పోలీసులు వెల్లడించారు. దీంతో పోలీసుతో జేసీ వాగ్వాదానికి దిగారు. పోలీసులు తనను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ఎమ్మెల్యే పెద్దారెడ్డి వెళ్లిపోయిన తర్వాత జేసీని పోలీసులు తిరునాళ్లకు వెళ్లేందుకు అనుమతించారు.
కాగా తాడిపత్రిలో జేసీ, కేతిరెడ్డి కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. గత ఫిబ్రవరి నెలలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తండ్రి రామిరెడ్డి విగ్రహావిష్కరణ సందర్భంగా ఇరు వర్గాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. విగ్రహ ఏర్పాటు విషయంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఉద్రిక్తత కారణంగా ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో రంగనాథస్వామి తిరునాళ్లలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొనకుండా ఉండేందుకు పోలీసులు ఇరువర్గాల నేతలు ఎదురుపడకుండా చర్యలు తీసుకున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో అటు ఎమ్మెల్యే, ఇటు మున్సిపల్ ఛైర్మన్ మధ్య వివాదాల నేపథ్యంలో అధికారులు నలిగిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది.
Somu veerraju: ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణకు హిందూ దేవాలయాల నిధులా?
