Site icon NTV Telugu

ఏపీ బ‌డ్జెట్‌పై స్వ‌రూపానందేంద్ర ప్ర‌శంస‌లు

Swaroopanandendra

ఆంధ్రప్రదేశ్ వార్షిక బ‌డ్జెట్ 2021-22పై ప్ర‌శంస‌లు కురిపించారు విశాఖ శారదా పీఠాధిప‌తి స్వరూపానందేంద్రస్వామి.. ఏపీ బ‌డ్జెట్‌పై స్పందించిన ఆయ‌న‌.. అర్చకుల వేతనాల కోసం బడ్జెట్‌ కేటాయింపులపై హ‌ర్షం వ్య‌క్తం చేశారు.. అర్చకుల వేతనాల కోసం బడ్జెట్‌లో రూ.120 కోట్లు కేటాయించడం హర్షణీయమ‌న్న ఆయ‌న‌.. దశాబ్దాలుగా అర్చకుల వేతనాలపై గత ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోలేద‌ని విమ‌ర్శించారు. జీతాలను పెంచి అర్చకుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం వైఎస్‌ జగన్ అభినందనీయుడు అని పేర్కొన్న స్వరూపానందేంద్ర.. రిషికేశ్ లో ఉన్న మేం ఈ వార్త విని ఆనందించాం.. జగన్మోహన్ రెడ్డికి రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉంటాయ‌న్నారు.

Exit mobile version