NTV Telugu Site icon

Swaroopananda: గొప్ప నారసింహక్షేత్రం సింహాచలం

సింహాచలం అప్పన్న చందనోత్సవం కనుల పండువగా సాగుతోంది. చందనోత్సవానికి లక్షలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. ఈ చందనోత్సవానికి హాజరయ్యారు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర. లక్ష్మీనర్సింహ స్వామి నిజ రూపాన్ని దర్శించుకున్న స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర. ఏపీలో గొప్ప నారసింహక్షేత్రం సింహాచలం అన్నారు స్వరూపానందేంద్ర.

Swaroopananda 

సింహాద్రి అప్పన్నకు నిర్వహించే వేడుక చందనోత్సవం. వరాహ లక్ష్మీ నర్సింహ స్వామి దర్శనం సంతోషాన్నిచ్చిందన్నారు స్వరూపానందేంద్ర. తెలుగు రాష్ట్రాలు బాగుండాలని కోరుకున్నానన్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా చందనోత్సవానికి భక్తులను అనుమతించలేదన్నారు స్వరూపానందేంద్ర. రెండేళ్ల తర్వాత జరుగుతున్న చందనోత్సవానికి భక్తుల తాకిడి అధికంగా ఉంది. సింహాచలం దేవస్థానం చేసిన ఏర్పాట్లు బాగున్నాయని కితాబిచ్చారు స్వరూపానందేంద్ర. అధికారుల మధ్య సమన్వయంతో చందనోత్సవం వేడుకగా సాగుతోందన్నారు స్వరూపానందేంద్ర. ఈ చందనోత్సవం ద్వారా భక్తకోటికి స్వామి నిజరూపదర్శనం లభిస్తోంది. స్వామిని దర్శించుకుంటే కోరికలు నెరవేరతాయని, అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అంతరాలయంలో స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు. వీఐపీల తాకిడితో సింహాచలం సందడిగా మారింది. మరోవైపు ఏపీ సమాచార శాఖ మంత్రి వేణుగోపాల్ కృష్ణ స్వామివారిని దర్శించుకున్నారు. సీఎం జగన్ పేదరిక నిర్ములన యజ్ఞం చేస్తున్నారు. దానిని అడ్డుకునేందుకు శక్తులు పని చేస్తున్నాయి. ప్రహ్లాదుడిని రక్షించిన విధంగానే ఈ ప్రభుత్వాన్ని కాపాడమని వరాహాలక్ష్మి నర్సింహ్మ స్వామిని వేడుకున్నానన్నారు మంత్రి వేణుగోపాల కృష్ణ.

LIVE : అక్షయ తృతీయ సందర్భంగా సిరులతల్లికి విశేష పూజలు

Show comments