తెలంగాణ మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలి అని మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. తెలంగాణ మంత్రులు అనవసరంగా సీఎం జగన్ పై నిందలు వేస్తున్నారు. రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేసింది మాజీ సీఎం చంద్రబాబు. చంద్రబాబు జి ఓ 69 తెచ్చి రాయలసీమకు అన్యాయం చేశారు. 800 అడుగులు వద్ద విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు అని తెలిపారు. 254 టీఎంసీలు అనుమతులు లేకుండా నీటిని తరలిస్తున్నారు. ఫిర్యాదు చేస్తే కేంద్రం పట్టించుకోవడం లేదు. తెలంగాణ నుంచి ఫిర్యాదు వస్తే వెంటనే స్పందిస్తుంది. రాయలసీమకు అన్యాయం జరుగుతే ఇక్కడి ప్రజలు ఎంతటి త్యాగానికైనా ఏం చేయడానికైనా సిద్ధం అని పేర్కొన్నారు.
తెలంగాణ మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలి…
