Site icon NTV Telugu

Supreetha: మోకాళ్లపై శ్రీవారి మెట్లెక్కిన ప్రముఖ నటి కూతురు

Untitled Design

Untitled Design

తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. భక్తులు రద్ధీ ఎక్కువగా ఉన్నపట్టికి.. గంటలకు పైగా క్యూలో వెయిట్ చేసి మరీ స్వామి వారిని దర్శించుకుంటారు. సామాన్య జనాలకే కాకుండా.. సెలబ్రీటీలు, రాజకీయ నాయకులు కూడా స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్ లో వేచి ఉంటారు. అంతే కాకుండా సామాన్య భక్తులుగా ఏడు కొండలు ఎక్కి మొక్కులు చెల్లించుకుంటారు. అయితే ఇక్కడ ఓ ప్రముఖ నటి కూతురు తిరుమల మెట్ల మార్గం గుండా వెళ్లింది. అది కూడా మోకాళ్లపై..

Read Also: Lucky Lady: ఒకే మహిళకు రెండు మద్యం దుకాణాలు..

పూర్తి వివారాల్లోకి వెళితే.. సామాన్యులే కాదు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా రోజూ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి వస్తుంటారు. కొందరు వీఐపీ, వీవీఐపీ హోదాలో నేరుగా వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటే మరికొందరు సామాన్య భక్తుల్లా తిరుమల మెట్లు ఎక్కుతూ ఏడు కొండల స్వామికి మొక్కలు చెల్లించుకుంటారు. ఇంకొందరయితే మోకాళ్లపై నడుస్తూ వేంకటేశ్వర స్వామిని చేరుకుంటారు. అలా తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ కూడా మోకాళ్లపై నడుస్తూ తిరుమల కొండను చేరుకుంది. అనంతరం శ్రీవారికి మొక్కులు చెల్లించుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.

Read Also: Tragedy: ఏందమ్మా ఇది.. ఇద్దరు పిల్లలను తీసుకుని ప్రియుడితో జంపైన భార్య..

అయితే ఆమె ఎవరో కాదు… ప్రముఖ నటి అయిన సురేఖా వాణి కూతురు సుప్రీత. ఆమె ఇటీవలే ఓ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. కానీ ఆ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. ఏడాదిలో కనీసం రెండు, మూడుసార్లయినా ఇక్కడకు వస్తుంటారు తల్లీ కూతుళ్లు. అలా లేటెస్ట్ గా మరోసారి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు సురేఖా వాణి, సుప్రిత. అయితే ఈసారి సుప్రిత మాత్రం మోకాళ్లపై నడుస్తూ వెళ్లి మరీ ఏడుకొండల వాడిని దర్శించుకుంది. అయితే సినిమా రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించాలని సుప్రీత మోకాళ్లపై తిరుమల కొండకు చేరుకుందని..నెటిజన్లు అనుకుంటున్నారు. సుప్రీత సినిమా రిలీజ్ అయ్యి బంఫర్ హిట్ కొట్టాలని మనం కూడా ఏడుకొండల వాడిని కోరుకుందాం.

Exit mobile version