ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు మళ్లీ ఆయన్ను సర్వీస్‌లోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అయితే హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. కాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట లభించినట్లు భావించొచ్చు.
కాగా టీడీపీ హయాంలో అక్రమంగా నిఘా పరికరాలు కొనుగోలు చేసి గూఢచర్యం చేశారనే ఆరోపణల కారణంగా జగన్ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుపై రెండేళ్ల పాటు సస్పెన్షన్ విధించింది. అయితే రెండేళ్లు దాటినా సస్పెన్షన్‌ను తొలగించకపోవడంతో ఏబీ వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన పిటిషన్‌పై కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. రెండేళ్లు దాటినా ఇంకా సస్పెన్షన్ తొలగించకపోవడంపై సుప్రీంకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అఖిల భారత సర్వీసు అధికారులను రెండేళ్లకు పైగా సస్పెన్షన్‌లో ఉంచడం చట్ట విరుద్ధమని అభిప్రాయపడింది.
Supreme Court: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై కీలక ఆదేశాలు.. రేపటిలోగా వివరాలు సమర్పించాలి
