ఎమ్మెల్సీ అనంతబాబుకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.. అనంతబాబు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ షరతులు ట్రయల్ కోర్టు నిర్దేశిస్తుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ కేసు తదుపరి విచారణను మార్చి 14కు వాయిదా వేసింది. డ్రైవర్ హత్య కేసులో అనంతబాబు నిందితునిగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాజమండ్రిలోని ఎస్సి, ఎస్టీ కోర్టు, ఏపీ హైకోర్టు (High Court) అనంతబాబు (MLC Ananthababu) బెయిల్ పిటీషన్ కొట్టేశాయి.
Read Also: Tollywood Box Office: సినిమాలు ఫుల్… కలెక్షన్లు నిల్…
దీనితో అనంతబాబు కుటుంబసభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. డిఫాల్ట్ బెయిల్ కోసం సుప్రీంకోర్టును అనంతబాబు ఆశ్రయించారు. ఈ మేరకు కెవిఎట్ పిటిషన్ ను అనంతబాబు (MLC Ananthababu) కుటుంబసభ్యులు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అలాగే తదుపరి విచారణను డిసెంబర్ 12కు వాయిదా వేసింది. ఇవాళ విచారణ జరిగింది.
దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో మే 23 నుంచి రిమాండ్ లో వున్నారు అనంతబాబు. ఏడు నెలలుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో అనంతబాబు రిమాండ్ లో వున్నాడు. మొదట రాజమండ్రి ఎస్సీ-ఎస్టీ కోర్టు, తర్వాత హైకోర్టులో బెయిల్ పిటిషన్లు కొట్టివేశారు. దీంతో బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు అనంతబాబు లాయర్లు. కేసులో విచారణ పూర్తి కాలేదని కోర్టుకు మెమోలు సమర్పించారు కాకినాడ పోలీసులు. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్సీ అనంతబాబు కేసును సిబిఐకి అప్పగించాలన్న పిటిషన్ పై ఇవాళ ఏపీ హైకోర్టులో జరగనుంది విచారణ.
Read Also:Moga Cyclone: ‘మాండూస్’ ముగిసింది.. ‘మోగా’ మోగిస్తది
మే19 న హత్యకి గురి అయిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు సంచలనం కలిగించింది. నాటకీయ పరిణామాల మధ్య మే 23 న అనంత బాబును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహంను కారు లో ఇంటికి తీసుకువచ్చాడు అనంతబాబు. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు, బంధువులు, దళిత సంఘాల ఆందోళనతో కేసు నమోదైంది. తల్లి మృతి తో మధ్యంతర బెయిల్ పొందిన అనంత బాబు.. బెయిల్ కోసం పట్టువదలకుండా ప్రయత్నించాడు. తాజాగా బెయిల్ మంజూరు కావడంతో జైలు నుంచి విడుదల కానున్నాడు అనంతబాబు.