నారీ సంకల్ప దీక్ష చేసే అర్హత టీడీపీకి లేదని వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… టీడీపీ పై తీవ్ర విమర్శలు చేశారు. అది నారీ సంకల్ప దీక్ష కాదు. దుస్సంకల్ప దీక్ష అని ఎద్దేవా చేశారు. లోకేష్ పీఏ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నా రని దాన్ని చంద్రబాబు పక్కదోవ పట్టిస్తున్నారని అన్నారు. లోకేష్ స్విమ్మింగ్ పూల్ ఫోటోలు చూస్తే వారికి మహిళల పట్ల ఏమాత్రం గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు.
Read Also: ఇవాళ ఉద్యోగ విరమణ చేస్తున్న ఉద్యోగుల్లో గందరగోళం
టీడీపీలో చాలా మంది నాయకులు దుశ్శాసనుల్లా మారారని ధ్వజమెత్తారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, పుసుపు, కుంకుమ అంటూ చంద్రబాబు మహిళలను మోసం చేశారన్నారు. రిషితేశ్వరికి న్యాయం చేయలేని ప్రభుత్వం చంద్రబాబు అంటూ మండిపడ్డారు. వినోద్ జైన్ లాంటి వాళ్లను పెంచి పోషిస్తున్న చంద్రబాబు ఏ విధంగా దీక్షలు చేయిస్తున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలని సునీత డిమాండ్ చేశారు. వినోద్ జైన్ లాంటి వారికి ఈ సంఘంలో బతికే అర్హత లేదన్నారు. అతడికి ఉరి శిక్ష వేయాలని సీఎంని కోరుతున్నానని సునీత పేర్కొన్నారు.
