Anantapur JNTU: అనంతపురంలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ)లో విషాదం నెలకొంది. యూనివర్సిటీలోని ఎల్లోరా హాస్టల్ భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టిస్తోంది.. ఈసీఈ రెండో సంవత్సరం చదవువుతోన్న విద్యార్థి చాణక్య నందారెడ్డిగా గుర్తించారు యూనివర్సిటీ సిబ్బంది.. 19 ఏళ్ల చాణక్య.. ఇవాళ తెల్లవారుజామున హాస్టల్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి? అనేది తెలియాల్సి ఉంది.. రాత్రి స్నేహితులందరితో మాట్లాడి సంతోషంగానే ఉన్నాడని.. ఆ విద్యార్థి స్నేహితులు చెబుతున్నారు.. తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో.. తన స్నేహితులకు మొబైల్ ఫోన్‌లో ‘బై’ అని సందేశం పంపి.. ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, మొదటి సంవత్సరంలో 9.8 జీపీఏ మార్కులు సాధించినట్టు తెలుస్తోంది.. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.. విద్యార్థి మృతికి కారణం ఎవరు? అనే కోణంలో విచారణ మొదలుపెట్టారు.. అందులో భాగంగా.. విద్యార్థి సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.. మృతుడు చాణక్య నందారెడ్డిగా స్వస్థలం.. నెల్లూరు జిల్లాగా చెబుతున్నారు. కాగా, విద్యాసంస్థలు, యూనివర్సిటీల్లో వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.. కొందరు చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకుంటే.. మరికొందరు ఆర్థిక, మానసిక.. ఇతర సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి..
Read Also: Mekathoti Sucharitha: మేకతోటి సుచరిత ఆసక్తికర వ్యాఖ్యలు.. నా భర్త పార్టీ మారితే నేనూ వెళ్తా..