Site icon NTV Telugu

Guntur: గుంటూరులో వీధి కుక్కల స్వైర విహారం.. బాలుడిపై దాడి..

Untitled 1

Untitled 1

ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడులు ఎక్కవయ్యాయి. వీధుల్లో స్వైర విహారం చేస్తూ ప్రజలను భయాభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఆ మధ్య హైదరాబాద్ నగరంలో ఓ బాలుడిపై దాడికి చేయడంతో చిన్నారి మ`తి చెందిన ఘటన కలకలం రేపింది. తాజాగా ఏపీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అయితే అద`ష్టవశాత్తు బాలుడికి ప్రాణాపాయం తప్పింది. వివరాలు.. గుంటూరు జిల్లాలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. పట్టణంలోని సంపత్‌నగర్‌లో ఓ బాలుడిపై మూకుమ్ముడిగా వీధి కుక్కలు దాడి చేశాయి. వాటిని నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాలుడు భయంతో అరుస్తూ పరుగుల తీశాడు.

అదే సమయంలో అటుగా వస్తున్న వాహనదారులు బాలుడిని రక్షించారు. కుక్కలను అడ్డుకుని భయపెట్టి తరమడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పింది. అయితే ఈ ఘటనలో బాలుడు గాయపడటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల ఘటనలు ఎక్కువయ్యాయని, ఫిర్యాదు చేసిన అధికారులు తప్పించుకోవడం లేదని వాపోయారు. వీధి కుక్కలను కట్టడి చేయడంలో కార్పొరేషన్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని, ఇప్పటికైన స్పందించి సహాయ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version