NTV Telugu Site icon

సమావేశమైన ఉద్యోగ సంఘాల స్టీరింగ్ కమిటీ

ఏపీలో పీఆర్సీ పై ఉద్యోగ సంఘాలు తగ్గేదేలే అంటున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని ఉద్యోగ సంఘాలు ఏక తాటిపైకి వచ్చి పీఆర్సీ సాధన కమిటీగా ఏర్పడింది. అంతేకాకుండా సమ్మెకు పిలునివ్వనున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల స్టీరింగ్ కమిటీ సమావేశమైంది. పీఆర్సీ సాధన సమితి ముఖ్య నేతలు బొప్పరాజు, బండి శ్రీనివాస రావు, వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ లు విజయవాడ రెవెన్యూ భవన్ కు చేరుకున్నారు. రేపు సమ్మె నోటీసు ఇవ్వాలని పీఆర్సీ సాధన సమితి నిర్ణయించింది.

పీఆర్సీ అంశం పై ఉద్యోగులను నచ్చచెప్పేందుకు ఇప్పటికే ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. రేపు సీఎస్ కు సమ్మె నోటీసు ఇవ్వనున్న నేపధ్యంలో కమిటీ తొలి సమావేశం, కార్యాచరణ పై ఉత్కంఠ నెలకొంది. ఇంత వరకు కమిటీ నుంచి చర్చల కోసం మాకు ఎటువంటి పిలుపూ రాలేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. జీవోలు రద్దు చేయాలనే డిమాండ్ నెరవేరితేనే చర్చలకు వెళతామని, రేపటి కార్యాచరణ గురించి చర్చించటానికి స్టీరింగ్ కమిటీ సమావేశం అయ్యిందని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.