శ్రీశైల ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో 21 ట్రస్ట్ బోర్డ్ సమావేశం జరగింది. ఈ మీటింగ్ లో ట్రస్ట్ బోర్డ్ లో 30 ప్రతిపాదనలకు 28 ఆమోదం తెలపగా.. ఒకటి వాయిదా పడింది.. ఇంకో దాన్ని ట్రస్ట్ బోర్డు తిరస్కరించింది. శిఖరేశ్వరం ఆలయ ప్రహారీ గోడ పెంచి బండ పరుపు, ఆర్చ్ గేట్ సీసీ రోడ్డుకు 49 లక్షల రూపాయలను కేటాయించడానికి ఆమోదం తెలిపారు. ఇక, క్షేత్ర పరిధిలో పలు చోట్ల సీసీ రోడ్లు వేసేందుకు 29 లక్షలకు ఆమోదం.. అలాగే, భక్తుల వసతి సౌకర్యార్థం 200 గదుల వసతి నిర్మాణనికి దాదాపు 52 కోట్ల రూపాయల అంచన ప్రతిపాదనకు ఆమోదం లభించింది.
Read Also: Exam Postponed: తెలంగాణ జెన్ కో రాత పరీక్ష వాయిదా
ఇక, క్షేత్ర పరిధిలో ట్రాఫిక్, పార్కింగు తగ్గించేందుకు టోల్ గేట్, నంది సర్కిల్ ప్రీకాస్ట్ సెంటర్ డివైడర్లుకు 38.50 లక్షల రూపాయల ప్రతిపాదనకు ట్రస్ట్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజుల సత్రం నుంచి సిద్ధ రామప్ప కొలను వరకు కొండ లోయకు బ్రిడ్జి నిర్మించాలన్న ప్రతిపాదనకు ఆమోదం.. మల్లికార్జున సదన్ నుంచి టోల్ గేట్ వరకు టోల్ గేట్ నుంచి రామయ్య టర్నింగ్ వరకు ఫ్లై ఓవరు బ్రిడ్జి ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. సిద్ధిరామప్ప జంక్షన్ రహదారి విస్తరణ కళ్యాణ కట్ట మరమ్మతులకు 28.50 లక్షల రూపాయలకు ట్రస్ట్ బోర్డు ఆమోదం తెలిపింది. రాబోవు శివరాత్రి, ఉగాది మహోత్సవాలను సివిల్, ఎలక్ట్రికల్, 82 పనులకు 10 కోట్ల 54 లక్షల పనులకు ఆమోదం లభించింది. క్షేత్ర ప్రచారంలో భాగంగా స్థల పురాణం, చరిత్ర, క్షేత్ర ప్రత్యేకతలను చిత్రాలతో కాఫీ టేబుల్ బుక్ ప్రచురించేందుకు సైతం ట్రస్ట్ బోర్డు ఆమోదించింది.