NTV Telugu Site icon

శ్రీశైలంలో కార్తీకమాస శోభ.. భక్తులతో ఆలయం కిటకిట..

srisailam temple

కార్తీక మాసం లయకారుడు శివుడికి ఎంతో ప్రీతికరమైన నెల. ఈ నెలలో పెద్ద ఎత్తున్న భక్తులు శివాలయాలను దర్శించుకుంటుంటారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయానికి కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా ఈ రోజు భక్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనానికి విచ్చేసిన భక్తులతో ఆలయం కిటికిటలాడింది.

నేటి నుంచి డిసెంబర్‌ 4 వరకు కార్తీక మాస ఉత్సవాలు కొనసాగనున్నాయి. స్వామి వారి దర్శనార్థం విచ్చేసిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. కార్తీక దీపారాధన కోసం ఆలయ పరిసరాల్లోని గంగాధర మండపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.