ప్రముఖ దేవాలయం శ్రీశైలంలో షాపుల కేటాయింపు ఉత్కంఠ రేపింది. దుకాణాదారులు దేవస్థానం అధికారుల తీరుపై నిరసన తెలిపారు. చివరకు పోలీసుల పటిష్ట భధ్రత నడుమ సాగిన షాపుల లక్కీ డిప్ లో కేవలం 24 మంది మాత్రమే పాల్గొన్నారు. మొత్తం షాపుల వేలంలో దుకాణా దారులు పాల్గొనలేదు.
శ్రీశైలం దేవస్దానం పరిధిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్కంఠ వాతావరణం నెలకొంది. దేవస్దానంలోని మార్కెట్ షాపు అసోసియేషన్ తరఫున దుకాణాదారులందరూ మెయిన్ బజార్ షాపులు మొత్తం మూసివేసి నిరసనలు తెలిపారు. దీంతో ప్రధాన రహదారులన్నీ బోసిపోయి కనిపించాయి. శ్రీశైలంలోని లింగాయత్ సత్రం వద్ద భారీగా కూర్చుని వారు నిరసన తెలిపారు.
దేవస్దానం నూతనంగా నిర్మించిన లలితాంబిక షాపింగ్ కాంప్లెక్స్ లోకి పాత దుకాణాలు విడిచి పెట్టి కొత్త దుకాణాలలోకి తరలివెళ్లాలని దేవస్దానం అధికారుల ఆదేశాలతో షాపు యాజమానులు బెంబేలెత్తారు. దేవస్దానం పరిధిలోని షాపులు లక్కీ డిప్ పద్ధతిలో పాల్గొని దుకాణాలు దక్కించుకోవాలని అధికారులు కోరారు. అయితే పాతషాపులు వదలి ఎక్కడికి వెళ్లేది లేదని షాపులు మూసివేసి వ్యాపారాలు నిర్వహించమని నిరసన తెలిపారు.
కొత్తగా నిర్మించిన షాపులు వ్యాపారానికి అనువుగాలేవని దుకాణదారులు ఎక్కడికి వెళ్లమని భీష్మించుకు కూర్చున్నారు. దేవస్దానం అధికారులు ముందస్తు చర్యలలో భాగంగా లక్కిడిప్ నిర్వహించే ప్రదేశమంతా పోలీసు భద్రత నడుమ హాజరైన కొందరికి మాత్రమే లక్కీడిప్ నిర్వహించి దుకాణాలు కేటాయించారు. దేవస్దానం పరిధిలో మొత్తం 133 షాపులకు లక్కీ డిప్ పిర్వహించగా కేవలం 24 మంది మాత్రమే హాజరై షాపులు దక్కించుకున్నట్లు అధికారులు తెలిపారు.
Karnataka High Court: విడాకులు తీసుకున్నతర్వాత భార్య కట్నం, నగలు వెనక్కి ఇవ్వాల్సిందే