NTV Telugu Site icon

వైరల్ పిక్: చీర కట్టులో వానరం వయ్యారం

కోతి వేషాలు మనకు తెలియనిది కాదు. అయితే కోతి వేసే వేషాలు చూస్తే నవ్వు రాక మానదు. తాజాగా ఓ కోతి చీరను పట్టుకుని వయ్యారాలు ఒలకబోసింది. చేతికి దొరికిన చీరను కప్పుకుని సిగ్గులొలికింది. ఈ సీన్ ఏపీలో శ్రీకాకుళం పట్టణంలోని ఏడు రోడ్ల కూడలి వద్ద చోటు చేసుకుంది.

Read Also: ఇకపై ఆ షో చేయనంటున్న ఎన్టీఆర్ ?

దీంతో కోతి చేష్టల దృశ్యాలను పలువురు ఆసక్తిగా తిలకించడమే కాకుండా సెల్‌ఫోన్‌లలో బంధించారు. రోడ్డుపై పడి ఉన్న చీరలను తీసుకున్న వానరం తనకు నచ్చిన రీతిలో చుట్టుకుంది. పడుచు అమ్మాయిలే కుళ్లుకునే రీతిలో తన చీరకట్టు అందాలతో చూపరులను వానం మైమరిపించిందంటే అతిశయోక్తి కాదు. కాగా ప్రస్తుతం వానరం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.