Arasavilli temple: శ్రీకాకుళం జిల్లాలోని ప్రత్యక్ష దైవం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఆలయంలోని ఆదుత్యి మూలవీరట్ పాదాలను తాకాయి లేలేత సూర్యకిరణాలు. అరుణ వర్ణంలోని భానుకిరణాల స్పర్శతో దేదీప్యమానంగా మూలవిరాట్ భక్తులకు దర్శనం ఇచ్చింది. ఉదయం 6:05 గంటలకు కొన్ని నిమిషాలపాటు ఆవిష్కృతమైన ఈ అద్భుత దృశ్యాన్నం భక్తులకు కనువిందు చెసింది. ఆ సమయంలో స్వామివారిని చూసి భక్తులు తరించిపోయారు.. రేపు కూడా మళ్లీ స్వామి వారి మూల విరాట్ ను సూర్యకిరణాలు తాకే అవకాశం ఉందని పండితులు తెలిపారు. ప్రతి ఏటా దక్షిణాయంలో అక్టోబర్ 1 , 2 తేదీల్లో.. ఉత్తరాయణంలో మార్చి 9, 10 తేదీల్లో మూల విరాట్ ను నేరుగా సూర్యకిరణాలు తాకనున్నాయి. స్వామివారి మూలవిరాట్టును స్పృశించని కిరణ దర్శనం చేసుకున్న భక్తుల ఆనందం పర్యంతమయ్యారు.
Read Also: IND vs BAN: రోహిత్ శర్మకు గంభీర్ సందేశం.. అసలు విషయం చెప్పిన మోర్కెల్!